మహిళల అణచివేతను అరికట్టేందుకు ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం
విశ్వంభర, హైదరాబాదు : మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళల భద్రత, సమాన హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమాలు కొనసాగిస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. హైదరాబాదులో ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాల మొదటి రోజున జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థాగత బలోపేతం కోసం కృషి చేయాలని ఐద్వా మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న హింస, లైంగిక వేధింపులు, గృహ హింస, బాలికలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళల రక్షణకు అమలులో ఉన్న చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ, ఉపాధి, విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం మహిళల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు టి. జ్యోతి, ఎం. భారతి, రాష్ట్ర నాయకులు వి.ఎన్. ఆత్మలత, బుగ్గవీటి సరళ, పి. ప్రభావతి, కె. నాగలక్ష్మి, ఎం. రత్నమాల, పి. శైలజ, ఎం. వినోద, జి. అనురాధ, వై. వరలక్ష్మితో పాటు రాష్ట్రంలోని 29 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.