సబ్ జైల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- జైలర్ మల్లెల శ్రీనివాస్ రావు
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి . ఈవేడుకల్లో జైలర్ మల్లెల శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేశారు . ఈ సందర్భంగా జైలర్ మల్లెల శ్రీనివాసరావు మాట్లాడుతూ, అరవై ఏండ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్దించిందన్నారు . మరియు ఎందరో విద్యార్థులు, మేధావుల బలిదానాల పునాధుల పై నిర్మితమైన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన భాద్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు . ముఖ్యంగా యువత సన్మార్గంలో పయనించి నేర అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు . ప్రస్తుతం తెలంగాణ జెన్ జెడ్ యువశక్తి హక్కుల కోసమే కాకుండా దేశంపట్ల , తమ భాద్యతలు సైతం గుర్తెరుగాలని , సూచించారు . తద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం కూడా ఈ అభివృద్ధిలో ముందుంటుందని ఆకాంక్షించాడు . ప్రజాస్వామ్య యుతంగా రాజ్యాంగానికి లోబడి మనం చేసే ప్రతి మంచిపని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు . అంతేకాకుండా శిక్షను అనుభవిస్తున్న విచారణ ఖైదీలు పరివర్తన చెంది గౌరవంతో కూడిన జీవితాన్ని పొందాలని హితవుపలికారు . నవ సమాజ నిర్మాణమే తెలంగాణ అమరవీరులకు మనమిచ్చే గౌరవమని అన్నారు . అనంతరం జైల్లోని విచారణ ఖైదీలకు స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు .