కంటికి కనపడుతున్న అధికారుల వైఫల్యం

పిర్యాదు చేస్తే నిర్మణదారులతో కుమ్మక్కు...

నామమాత్రపు చర్యలు.. నిర్మాణం పూర్తి చేసుకోవాలని సలహాలు... 

 

WhatsApp Image 2024-07-05 at 2.57.28 PM

 విశ్వంభర కూకట్ పల్లి ప్రతినిధి : టీఎస్ బి పాస్ చట్టాన్ని బేకాతరు చేస్తూ ఓ నిర్మాణదారుడు కైతలాపూర్ మెయిన్ రోడ్ లో అక్రమంగా సెల్లార్ తో కలిపి ఏడు ఫ్లోర్ల భవనం నిర్మించాడు. టౌన్ ప్లానింగ్ విభాగానికి ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు రావడంతో తప్పని పరిస్థితుల్లో నాలుగో ఫ్లోర్ కు రంద్రం కొట్టి చేతులు దులుపుకున్నారు. ఐదో అంతస్తును వదిలేశారు.. వారం రోజులు పూర్తికాకుండానే నిర్మాణదారుడు నాల్గవ అంతస్తుకు మళ్ళీ స్లాబ్ కుమరమ్మతులు చేసి  నిర్మాణం పూర్తి చేశాడు. దీనిబట్టి అధికారుల నామమాత్రపు చర్యలు చేస్తూ నిర్మాణ దారులకు సహకరిస్తూ.. ప్రజా ధనంతో నెల జీతం తీసుకుంటూ ప్రయివేటు వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తుంది.. . మూసాపేట్ సర్కిల్ పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్న వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అనడానికి రోజురోజుకు పెరుగుతున్న అక్రమ నిర్మాణాలే సాక్షాలుగా కనిపిస్తున్నాయి.  ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి ఉంటే కానీ అక్రమ నిర్మాణాలపై  చర్యలకు దిగుతూ నామమత్రపు చర్యలతో చేతులు దులుపుతుంటున్నారు.

Read More  రోశయ్య వర్ధంతి సభకు తరలిరావాలి - మీడియా కమిటీ ఛైర్మన్ కౌటిక విఠల్

WhatsApp Image 2024-07-05 at 2.57.17 PM

 ప్రధానంగా ఓ ఉన్నతాధికారి,  ఔట్సోర్సింగ్ ఉద్యోగితో కలిసి తతంగం నడుపుతున్నట్టు అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన  అధికారులే వాటిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎవరైనా పిర్యాదు చేస్తే మారు క్షణం నిర్మాణ దారులకు సమాచారం ఇస్తూ.. వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు.. తక్షణమే సర్కిల్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై , అక్రణదారులకు వత్తాసు పలుకుతున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..