గ్రామాభివృద్దే  నా లక్ష్యం

గ్రామాభివృద్దే  నా లక్ష్యం

  • సర్పంచ్ దేవేందర్ నాయక్

 విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం  గంగారం గ్రామపంచాయతీ గంగారం తండాలో నూతనంగా  ఇందిరమ్మ  ఇళ్ల నిర్మాణానికి  భూమి పూజ చేసి ముగ్గు వేసిన సర్పంచ్ దేవేందర్ నాయక్, ఈ సందర్భంగా దేవేందర్ నాయక్  మాట్లాడుతూ, గ్రామంలో ఇంకా అర్హులైన నిరుపేదలకు    20 ఇండ్లు కావాలని,  గ్రామ పంచాయతీ లో  నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు  ఇవ్వాలని మంత్రి దృష్టికి   తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. ఇంకా కొన్ని ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో  వస్తాయని గ్రామస్తులకు తెలిపారు. గ్రామంలో డ్రైనేజ్, వాటర్ సమస్య, కరెంటు, ఇలాంటి  ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో. వార్డ్ మెంబర్ ఎం. రవి, ఎం. దేవా,  భాస్కర్, ఎం.  ధర్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: