ల్యాబ్ టెక్నీషియన్స్ నూతన కమిటీ
On
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా లో ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్స్ జిల్లా యూనియన్ ఎన్నుకున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో నూతన ల్యాబ్ టెక్నీషియన్స్ ఎన్నికైన అభ్యర్థులు, జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించి నూతనంగా అసోసియేషన్ జిల్లా బాధ్యులను ఎన్నుకోవడం జరిగింది.జిల్లా ప్రెసిడెంట్గా బొల్లం శరత్ బాబు , ప్రధాన కార్యదర్శిగా గాండ్ల మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు గా ధరావత్ కృష్ణ, కమటం ప్రేమ్ సాగర్ , పబ్లిసిటీ అడ్వైజరి మెంబర్ గా ఎస్.కె అక్బర్ పాష, ట్రెజరర్ గా భానోత్ బాలు , ట్రెజరర్గా కోలు మధుసూదన్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఏ సమస్య వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా,ల్యాబ్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు.



