మహిళా సంఘాల భవన నిర్మాణాలకు ప్రాధాన్యం
- సర్పంచ్ నల్ల సుమిత రఘుమారెడ్డి
విశ్వంభర, చింతపల్లి : మహిళా సంఘాల సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల భవనాలు నిర్మిస్తుందని మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నల్ల సుమిత రఘుమారెడ్డి అన్నారు. శుక్రవారం మల్లారెడ్డిపల్లి గ్రామంలో మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, గతంలో మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉండేది అని నూతన సంఘం భవనాల నిర్మాణంతో ఆ సమస్య తొలగిపోతుందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 10 లక్షలతో వివో బిల్డింగ్ నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. మహిళల అభ్యున్నతికి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తుందని, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు అప్పచెప్పి వారు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మహిళకు గృహజ్యోతి, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వంటి పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల రఘుమారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగభూషణం, సుధాకర్ రెడ్డి, మహిళా సంఘము అధ్యక్షురాలు యాదమ్మ, అధికారులు, వార్డు మెంబర్,లు గ్రామ ప్రజలు , తదితరులు పాల్గొన్నరు.



