ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వనమహోత్సవం
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో శనివారం వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ చైర్మన్ వంకడోత్ లలిత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థినులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డి. కరుణాకర్ మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డి. రవీందర్, శ్రీ ఎస్. సదానందం, బి. లక్ష్మయ్య, ఏ. సంపత్,కే. సరూప,ఎస్. కవిత, ఆస్మా ఫిర్దోస్, ఓ. రాణి, అధ్యాపకేతర సిబ్బంది జూనియర్ అసిస్టెంట్లు కె. గీతాంజలి,ఎస్. రాములు, రికార్డ్ అసిస్టెంట్ టి. రమాదేవి, విద్యార్థినులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.