డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన

  •  ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణ చర్యలు

విశ్వంభర,  హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దాదాపు 80కి పైగా ఫోన్ కాల్స్‌కు స్వయంగా స్పందించారు. ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి, సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పెండింగ్ అభివృద్ధి పనుల పూర్తి, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన వేదికగా నిలుస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.  ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి సమస్యను బాధ్యతాయుతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/great-response-to-dial-your-mla-programme/article-20720

Tags: