ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ఆగస్టు 10 వరకు గడువు పొడిగింపు
- అదనపు సమయాన్ని నాణ్యత పెంపునకు వినియోగించాలి: భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి ఆగస్టు 10 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో, లభించిన అదనపు సమయాన్ని పూర్తిగా నాణ్యత పెంపునకు వినియోగించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న ఓటరు అవగాహన కార్యక్రమాలు, ఫారం ఫిల్లింగ్ మేళాలను అభినందించారు. ఇప్పటికే డిజిటైజ్ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు, ఫోటోలు, పత్రాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నాణ్యతను నిర్ధారించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను జాగ్రత్తగా చేపట్టి, సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాలనే పోలింగ్ కేంద్రాలుగా వినియోగించాలని, మరణించిన, చిరునామా మార్చుకున్న లేదా గుర్తించలేని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాలని సూచించారు. ప్రజలకు బీఎల్‌వోలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 3,501 పోలింగ్ కేంద్రాలు, 36.99 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం 63.53 శాతం మ్యాపింగ్ పూర్తైందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పెండింగ్ మ్యాపింగ్, డూప్లికేట్, అనామలీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఆగస్టు 10 వరకు పొడిగించిన గడువును పూర్తిగా వినియోగించుకుని ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి, బీఎల్‌వోలు, బీఎల్‌ఏల సహకారంతో పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమీక్ష అనంతరం భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ కొంగర, బొంగులూరు, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి బీఎల్‌వోలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు