శనేశ్వర స్వామికి వైభవంగా తిలతైల అభిషేకాలు#Draft: Add Your Title

విశ్వంభర, నాగర్‌కర్నూల్: బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనివారం తిలతైల అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. శని గ్రహదోష నివారణ కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ, శ్రావణ మాసంలో శనేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. జన్మరీత్యా, గోచార రీత్యా శని గ్రహదోష నివారణ కోసం ప్రతి ఒక్కరూ స్వామివారిని పూజించాలని సూచించారు. అలాగే ఆలయంలోని పరమశివునికి రుద్రాభిషేకాలు, నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/saneswara-swamys-abhishekala-draft-add-your-title/article-20765

Tags: