ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

  • అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు

విశ్వంభర, మహబూబాబాద్: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 1 నుంచి 7 వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. ఈ ఏడాది "సుస్థిరమైన జీవితానికి తల్లిపాలతోనే ఉత్తమ ప్రారంభం – ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేద్దాం" అనే థీమ్‌తో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 3,749 మంది గర్భిణీలు, 2,607 మంది బాలింతలు ఉన్నారని తెలిపారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ప్రారంభించడం, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, అనంతరం అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం వంటి అంశాలపై తల్లులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/august-1st-to-7th-is-world-breastfeeding-week/article-20724

Tags: