ఇంద్రపాలనగరంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
విశ్వంభర, రామన్నపేట: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొనడం జరిగింది. అనంతరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, గర్భిణీలు ప్రసవం అయిన అర్ధగంట లోపే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించడం ఎంతో శ్రేష్ఠమైనవని, జీవితకాలం ఆరోగ్యావంతంగా ఉండేందుకు దోహద పడతాయని గర్భిణీలను ఉద్దేశిస్తూ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిడిఓ వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి నరేందర్, సూపర్ వైజర్ సుజాత, పోషణ అభియాన్ అశోక్, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.