మాస్టర్ మైండ్స్ పాఠశాల తరలింపుపై తల్లిదండ్రుల ఆందోళన

  • ఈ విద్యా సంవత్సరం ఇక్కడే కొనసాగించాలని డిమాండ్

విశ్వంభర, మేడిపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న మాస్టర్ మైండ్స్ పాఠశాలను మరో ప్రాంతానికి తరలించనున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆందోళన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఎండీ అన్వర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అడ్మిషన్ల సమయంలో పాఠశాల మార్పు విషయాన్ని వెల్లడించకుండా, విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచిన తర్వాత బోడుప్పల్‌కు షిఫ్ట్ చేస్తామని చెప్పడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సమీపంలో ఉండటంతోనే తమ పిల్లలను చేర్పించామని, ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఇతర పాఠశాలల్లో అడ్మిషన్ చేయించేవారమని తెలిపారు. యాజమాన్యం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పినా, అది సమస్యకు పరిష్కారం కాదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న శ్రీరామ్ నగర్ భవనంలోనే తరగతులు నిర్వహించి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాత్రమే పాఠశాలను తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో కొంతసేపు పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం తల్లిదండ్రులు యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ విషయంపై పాఠశాల హెడ్‌మాస్టర్ స్పందిస్తూ, సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని, వచ్చే బుధవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/parental-concern-over-master-minds-school-move/article-20683

Tags: