పుట్టిన గంటలో శిశువులకు ముర్రుపాలు పట్టించాలి
- ఏ సి డి పి ఓ కమలాదేవి
విశ్వంభర, ఇనుగుర్తి: పుట్టిన గంటలోపే పిల్లలకు ముర్రుపాలు పట్టించాలని ఐసిడిఎస్ ఏసిడిపిఓ కమలాదేవి అన్నారు. తల్లిపాల తోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యమని చెప్పారు.ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లిలో అంగన్వాడి ఇన్చార్జి టీచర్ ఎం వి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి ఆమె హాజరై తల్లిపాలలోనే రోగనిరోధక శక్తి ఉంటుందన్నారు, శిశువులకు ఆరు మాసాలు వచ్చేంతవరకు క్రమం తప్పకుండా తాగించాలని సూచించారు. ఆరు నెలల అనంతరం హనుమంత ఆహారం ఇవ్వాలన్నారు.ప్రభుత్వం సరఫరా చేసే ఫీడింగును సద్వినియోగం చేసుకోవాలని చిన్నారులు గర్భిణీలు,బాలింతలకు సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలు విశిష్టత, పోషకాహారం పై వేసిన చార్టు ఆకట్టుకుంది.అనంతరం పుట్టిన ప్రతి బిడ్డకు ముర్రు పాలు పట్టిస్తామని గర్భిణీలు తల్లులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ దుర్గ గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలు పాల్గొన్నారు.