ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి: బి. దత్తు నాయక్

విశ్వంభర, మహేశ్వరం: తుక్కుగూడ పట్టణంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించనున్న ఏఐటీయూసీ నాలుగో రంగారెడ్డి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి. దత్తు నాయక్ పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. వివిధ మండలాల కార్మిక సమస్యలు, జిల్లా స్థాయి అంశాలు, రాష్ట్ర కమిటీ నిర్ణయాలపై చర్చించి, స్థానిక సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. మహాసభల సందర్భంగా తుక్కుగూడ పట్టణాన్ని ఏఐటీయూసీ జెండాలు, తోరణాలు, బ్యానర్లతో అలంకరించినట్లు తెలిపారు. కార్మికులు, ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/b-dattu-naik-should-make-aituc-district-mahasabhas-a-success/article-20732

Tags: