‘తెలంగాణ రైజింగ్-2047’లో కార్పొరేట్ భాగస్వామ్యం కావాలి
విశ్వంభర, కొండాపూర్ : సీఎస్ఆర్ ద్వారా ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్య సాధనలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాదు కొండాపూర్‌లో శనివారం నిర్వహించిన 50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రూపొందించిన విజన్ అని, ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం సమష్టిగా కృషి చేస్తేనే లక్ష్యాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. సీఎస్ఆర్ కార్యక్రమాల అమలు, పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు, డేటా పరిపాలన, సైబర్ భద్రత వంటి రంగాల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ సెక్రటరీలు వ్యూహాత్మక సలహాదారులుగా వ్యవహరించాలని సూచించారు. అలాగే కంపెనీలు లాభార్జనతో పాటు సుస్థిర, నైతిక వ్యాపార విధానాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో: మహదేవ్ తిరునగరి, ఎం. దామోదరన్, శిల్పా, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు