తప్పిపోయిన మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
విశ్వంభర, కాచిగూడ : హైదరాబాదు కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటరిగా తిరుగుతున్న గుర్తుతెలియని మహిళను కాచిగూడ పోలీసులు శనివారం గుర్తించి రక్షించారు. ఆమె వద్ద లభించిన చిన్న డైరీలోని ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులను సంప్రదించి, ఎం. లక్ష్మి (55), కాటేదాన్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె జూలై 31న ఉస్మానియా ఆసుపత్రి నుంచి కనిపించకుండా పోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మహిళను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.