జిల్లాలో ముగిసిన 12వ విడత ఆపరేషన్ ముస్కాన్
- 127 మంది బాలల గుర్తింపు
- 90 కేసులు నమోదు
- బాలల రక్షణకోసం నిరంతర తనిఖీలు నిర్వహిస్తాం
- బాలలతో వెట్టిచాకిరి చేయిస్తే చర్యలు తప్పవు.- ఎస్పి నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: వెట్టిచాకిరి కి, నిరాదరణకు గురైన బాలబాలికలకు, తప్పిపోయి వచ్చిన బాలలను గుర్తించి సంరక్షించడం లో బాగంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పి నరసింహ తెలిపారు. జిల్లాలో జూలై నెలలో నెలరోజుల పాటు జిల్లా పోలీసు, జిల్లా యంత్రాంగం, జిల్లా సంక్షేమం, బాలల రక్షణ, లేబర్, రెవెన్యూ, హెల్త్ మొదలగు డిపార్ట్మెంట్ ల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంను పగడ్బందిగా నిర్వహించామని చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్ పూర్తయిన సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు సంబంధిత బృందాలతో సమావేశం నిర్వహించి ముస్కాన్ కార్యక్రమంలో బాగా పని చేసి ఎక్కువ పిల్లలను సంరక్షించడంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరాదరణకు, వెట్టిచాకిరీ గురవుతున్న 127 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సమరక్షులకు క్షేమంగా అప్పగించడం జరిగినదని అన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 56 మంది బాలలు ఉండగా వీరిలో 52 మంది బాలురు, 4 గురు బాలికలు ఉన్నారు, అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 71 మంది బాలలు ఉండగా వీరిలో 65 మంది బాలురు, 6 గురు బాలికలు ఉన్నారు అని ఎస్పీ తెలిపినారు. అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ టీమ్స్ వివిధ ప్రదేశాల్లో వీరందరినీ గుర్తించి వీరికి రక్షణ కల్పించడం జరిగినది అన్నారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని చేరేలా సిబ్బంది అందరూ బాగా పని చేశారు, బాలకార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించి బాలల వికాసానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలని అన్నారు. భాలల రక్షణలో పోలీసు తనిఖీలు నిరంతరంగా నిర్వహిస్తామని అన్నారు. బాలల వికాసానికి, బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని కోరినారు. వెట్టిచాకిరి గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా 127 మంది పిల్లలను గుర్తించడంలో బాగా పని చేసిన పోలీసు సిబ్బంది, జిల్లా బాల రక్షణ అధికారులను, వివిధ శాఖల సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాను అని ఎస్పి తెలిపినారు. చదువులతో మంచి భవిష్యత్తు ఉన్నది అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి, ప్రభుత్వాలు ఉచిత వసతి తో కూడిన విద్యను అందిస్తున్నాయి, పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారికి బంగారు భవిష్యత్తును అందించాలి అని తల్లిదండ్రులకు ఎస్పి విజ్ఞప్తి చేశారు. అలవాటుగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అలాంటివారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్ రాజ్, డిసిఆర్బి డిఎస్పి రవి,, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దుం అలీ, మహిళా ఎస్ఐ లు మౌనిక, నీలిమ, చైల్డ్ సంరక్షణ అధికారులు శ్రీలక్ష్మి, ఉమామహేశ్వరి, నాగులమీరా, నాగరాజు, వంశీ, విద్యాసాగర్, ముస్కాన్ బృందం ఎస్ఐ మల్లేశం, రహిముద్దిన్, ఏఎస్ఐ వెంకన్న, ఏఎస్ఐ సైదాబి లేబర్ శాఖ సిబ్బంది సందీప్, ముస్కాన్ టీమ్స్ సిబ్బంది ఉన్నారు.