గొల్ల , కురుమలు ఐక్యంగా ఉండాలి

గొల్ల , కురుమలు ఐక్యంగా ఉండాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: గొల్ల, కురుమలు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలని సమాచార హక్కు కమిషన్ మాజీ చైర్మన్ వర్రె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన "యాదవ కంఠం" మాసపత్రిక ఆవిష్కరణ, నూతనంగా నియమితులైన చైర్మన్, డైరెక్టర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాదవ, కురుమ సంఘాల మధ్య విభేదాలకు తావివ్వకుండా అందరూ ఒకే వేదికపై పనిచేయాలని సూచించారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. కోకాపేటలో యాదవ హాస్టల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి ఐక్యతే బలమని అన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో యాదవ యువత ముందుకు రావాలని, సంఘాలన్నీ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య గొల్ల, కురుమల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సరిత, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు, జంగయ్య యాదవ్, భాస్కర్, నక్క శ్రీనివాస్, వేణుగోపాల్, దేవేందర్, శ్రీనివాస్ యాదవ్, పుల్లారావు యాదవ్, ఎంబి కృష్ణారావు, సుభాష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/golla-kurumas-should-be-united/article-20681

Tags: