కార్పొరేట్ ఉద్యోగుల హక్కుల చట్టం కోరుతూ ధర్నా

విశ్వంభర, ముషీరాబాదు : కార్పొరేట్, ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ శనివారం హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో కార్పొరేట్ ఉద్యోగులు శాంతియుత ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత, సేవా నిబంధనలు, సంక్షేమానికి స్పష్టమైన చట్టపరమైన రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హాజరు నమోదు, వేతన కోతలు, ఉద్యోగాల తొలగింపులో పారదర్శక విధానాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో కెవిన్ కృష్ణ, భావనా శర్మ, నర్సిరెడ్డి, సుధీర్, సుజాని, సుమన్ తదితరులు నాయకత్వం వహించారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-sit-in-demanding-the-corporate-employees-rights-act/article-20771

Tags: