బాధిత కుటుంబానికి అయ్యప్ప భక్తుల చేయూత

బాధిత కుటుంబానికి అయ్యప్ప భక్తుల చేయూత

విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని చిన్న ముప్పారం గ్రామానికి చెందిన అయ్యప్ప భక్త మండలి సభ్యుడు బేతం అయిలయ్య ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో స్థానిక అయ్యప్ప భక్తమండలి శనివారం స్వర్గీయ ఐలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ ఆపద కాలంలో మనోధైర్యాన్ని కోల్పోవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బియ్యం అందజేసి చేయూతనందించారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తమండలి ప్రతినిధులు కామిని హరికృష్ణ, జక్కుల శ్రీనివాస్,కందాల బాలకృష్ణ,గోనె రవి,దర్శనం గణేష్,బుర్రి యాకయ్య,నర్ర యాకన్న,ఎడ్లోజు రాజేందర్, గాడి పెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ayyappa-devotees-offer-condolences-to-the-victims-family/article-20759

Tags: