కాచం కృష్ణమూర్తి స్ఫూర్తితో భూ పోరాటాలను ఉధృతం చేద్దాం: ఎస్. వీరయ్య
విశ్వంభర, వలిగొండ: కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి స్ఫూర్తితో భూమిలేని పేదలకు భూములు, ఇళ్ల స్థలాల సాధన కోసం భూ పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల సీపీఎం కార్యాలయంలో శనివారం కొండే కిష్టయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో కాచం కృష్ణమూర్తి 20వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం వీరయ్య మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కాచం కృష్ణమూర్తి పేదలకు ప్రభుత్వ భూములను సాధించి పెట్టిన గొప్ప నాయకుడని కొనియాడారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువత ప్రజా సమస్యలపై ఉద్యమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. జహంగీర్ మాట్లాడుతూ కొత్త పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా పారదర్శకంగా నిర్వహించాలని, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్ధిదారులను వెంటనే గుర్తించి, మొదటి విడత ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.