మంత్రి పొన్నం చొరవతో మస్కట్ నుంచి స్వగ్రామానికి శంకర్
- ఎంబసీ సహకారంతో క్షేమంగా చేరిక.. మంత్రికి కృతజ్ఞతలు
విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన ఉప్పుల శంకర్ ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొనడంతో, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఎంబసీ సహకారంతో క్షేమంగా స్వదేశానికి చేరుకున్నాడు. జూలై 6న ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మస్కట్‌కు వెళ్లిన శంకర్‌కు నిర్మాణ సంస్థలో ఉద్యోగం ఇస్తామని చెప్పి, అక్కడ ప్యాకింగ్ పనిలో నియమించారని, సరైన వసతి, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తన పరిస్థితిని గ్రామ కాంగ్రెస్ నాయకుల ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి వెంటనే భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టించారు. ఎంబసీ అధికారులు కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయించి శంకర్‌ను జూలై 31న స్వదేశానికి పంపించారు. స్వగ్రామానికి చేరుకున్న శంకర్ తనను సురక్షితంగా తిరిగి రప్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంబసీ అధికారులు, సహకరించిన కాంగ్రెస్ నాయకులు, మిత్రుడు శివకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్న రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శంకర్‌ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందనతోనే శంకర్ స్వదేశానికి చేరుకోగలిగాడని వెన్న రాజు పేర్కొన్నారు.