యువత రాజకీయాల్లోకి రావాలి: ఈటీ నర్సింహా

యువత రాజకీయాల్లోకి రావాలి: ఈటీ నర్సింహా

విశ్వంభర, హిమాయత్ నగర్ : యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలని, కేంద్ర ప్రభుత్వ యువజన వ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారా ఎదుర్కోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఈటీ నర్సింహా పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల లోగోను శనివారం హైదరాబాదు హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల యువతకు శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, అందుబాటు వైద్యం అందడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పరిరక్షణలో ముందుండాలని కోరారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల్లో నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్య, వైద్య రంగాలు, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయంపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/youth-should-come-into-politics-et-narsimha/article-20707

Tags: