అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ జాతీయ ఉపకార వేతనానికి ఎంపికైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రతిష్టాత్మక అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ జాతీయ ఉపకార వేతనానికి ఎంపికైనట్లు కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలియజేశారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించి ఉత్తమ ప్రతిభ కనబరచినందుకుగాను సంతోష ఈ ఉపకార వేతనానికి ఎంపికైనట్లుగా తెలియజేశారు. కష్టపడి చదివే వారికి తప్పకుండా తగిన ఫలితం లభిస్తుందని, సంతోషను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మంచి ప్రతిభావంతులుగా రాణించాలని కోరారు. ఈ సందర్భంగా రావిరాల సంతోషను డిగ్రీ కళాశాల  ప్రదానాచార్యులుతో పాటు అధ్యాపకులు అభినందించారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/azim-prem-ji-is-a-government-degree-college-student-selected/article-20696

Tags: