హైవేలపై అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు

హైవేలపై అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు

  • నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు: డీటీవో శంకర్ నాయక్

విశ్వంభర, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా గుండా వెళ్లే రెండు జాతీయ రహదారులపై అక్రమ పార్కింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా రవాణా అధికారి (డీటీవో) శంకర్ నాయక్ తెలిపారు. రహదారుల వెంట ఉన్న డాబాలు, హోటళ్లు, విశ్రాంతి కేంద్రాల వద్ద లారీలు, బస్సులు, ట్రాక్టర్లు తదితర భారీ వాహనాలను ప్రమాదకరంగా నిలిపివేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రెడ్ రిఫ్లెక్టర్లు, పార్కింగ్ లైట్లు, హెచ్చరిక త్రిభుజాలు లేకుండా వాహనాలు నిలిపివేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. మోటారు వాహనాల చట్టం–1988 సెక్షన్ 122 ప్రకారం జాతీయ రహదారులపై ప్రమాదకరంగా వాహనాలను నిలిపివేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫోటోలు, వీడియోల ఆధారంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు అత్యవసర పరిస్థితులు మినహా హైవేలపై వాహనాలు నిలిపివేయకుండా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రయాణించాలని డీటీవో శంకర్ నాయక్ సూచించారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/strict-action-against-illegal-parking-on-highways/article-20742

Tags: