డిగ్రీ మొదటి సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్
విశ్వంభర, మహబూబాబాద్: డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరొక గొప్ప అవకాశం కల్పించిందని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్, (ఆటానామస్) ప్రిన్సిపల్ ప్రొఫెసర్. బి. లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రత్యేక విడత కౌన్సిలింగ్ కు ఉన్నత విద్యామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 20 నుండి 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఈ నెల 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు అవకాశం ఉందని తెలిపారు. గతంలో సీటు వచ్చి, నచ్చని కళాశాలలో చేరిన వారు కూడా తమ కళాశాలలో చేరాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చని తెలిపారు. డిగ్రీ లో అడ్మిషన్ పొందగోరు విద్యార్థులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాల దోస్త్ కోఆర్డినేటర్ డా. వి. సాంబశివరావును 9440343941 నెంబర్ ద్వారా లేదా నేరుగా కళాశాలకు వచ్చి సంప్రదించాలని కోరారు.