సికింద్రాబాద్ బోనాల్లో జోగినిల ఆందోళన.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం
- అమ్మవారికి బోనం తీసుకెళ్తుండగా తోసేశారంటూ జోగిని కన్నీటి పర్యంతం.
- వీఐపీలకే ప్రాధాన్యం.. బోనాల ఉత్సవ కమిటీలో తమకు చోటు లేదంటూ శివసత్తుల మండిపాటు.
Secunderabad Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా జోగినిలు, శివసత్తులు ప్రభుత్వ, పోలీసుల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు తమను అడ్డుకుని తోసివేశారని జోగినిలు ఆరోపించారు. ఈ ఘటనలో ఓ జోగిని చేతిలో ఉన్న బోనం కిందపడిపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమై ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించాల్సిన బోనం నేలపై పడిపోవడం తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వాపోయారు.
ఈ సందర్భంగా శివసత్తులు మాట్లాడుతూ ప్రభుత్వం బోనాల ఉత్సవాల్లో కేవలం వీఐపీలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. సంప్రదాయంగా బోనాల వేడుకల్లో కీలక పాత్ర పోషించే జోగినిలు, శివసత్తులను బోనాల ఉత్సవ కమిటీలో చేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేకంగా నిర్వహించిందని, ప్రస్తుతం ఆ సంప్రదాయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. బోనాల ఉత్సవాల్లో భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సంప్రదాయాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, జోగినిలు, శివసత్తులకు తగిన గౌరవం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.