ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ.6 వేల జరిమానా

  • ఒక రోజు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశం

విశ్వంభర, మహేశ్వరం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన రాట్లావత్ మల్లేష్‌పై మహేశ్వరం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను ఇబ్రహీంపట్నం న్యాయస్థానం మేజిస్ట్రేట్ సుజాత ఎదుట హాజరుపర్చగా, కేసును విచారించిన కోర్టు రూ.6 వేల జరిమానా విధించింది. అదేవిధంగా, ఒక రోజు పాటు మహేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా మహేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-person-who-violates-traffic-rules-will-be-fined-rs/article-20740

Tags: