నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

  • 11 లీటర్ల నాటుసారా స్వాధీనం.. 1,200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా ఎక్సైజ్ అధికారి కరంచంద్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి ఆధ్వర్యంలో కురవి మండలం లింగ్య తండా (బలపాల) గ్రామంలో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మాలోతు స్వప్న, జాటోతు సునీత, జాటోతు కమలపై కేసులు నమోదు చేసి 11 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1,200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం వారిని కురవి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఇక గతంలో పలుమార్లు సారాయి రవాణా చేస్తూ పట్టుబడి, తిరిగి నాటుసారా తయారీ, రవాణాకు పాల్పడిన కురవి మండలం జగ్యా తండాకు చెందిన బాదావత్ జయేందర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ గుడుంబా, నాటుసారా తయారీ, రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు అశోక్ కుమార్, కిరీటి, ట్రైనీ ఎస్సై నాగమృతతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/excise-raids-on-settlements-across-the-country/article-20750

Tags: