విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలి
- ఈ నెల 10న జైల్ భరోకు వృత్తిదారుల పిలుపు
విశ్వంభర, ముషీరాబాదు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు–2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాదు ముషీరాబాదులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే రజకులు, క్షౌరవృత్తి దారులు, చేనేత, కుమ్మరి, కమ్మరి, కార్పెంటర్, స్వర్ణకారులు తదితర చేతివృత్తిదారులు విద్యుత్ సబ్సిడీ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. ప్రజావ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న నిర్వహించే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో వృత్తిదారులందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేశం మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాదులోని సెలూన్‌లకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. సమావేశంలో మరియాల గోపాల్, కె. యాదగిరి, పెద్దాపురం భాస్కర్, మనోహర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు