సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శిరీష ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై, వారికి న్యాయ అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులు, బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై లైంగిక వేధింపుల నివారణకు సంబంధించిన పోక్సో చట్టం, మంచి స్పర్శ–చెడు స్పర్శ (సేఫ్ టచ్ - అన్సేఫ్ టచ్), మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, ఉచిత న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్), న్యాయాన్ని పొందే హక్కు, సైబర్ భద్రత వంటి అంశాలపై విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. అదే విధంగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సుక్క శ్రవణ్ కుమార్ కూడా పై అంశాలపై విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పిస్తూ, వారి హక్కులు, బాధ్యతలు, చట్టాలను గౌరవించే విధానం, సైబర్ నేరాల నుండి రక్షణ, బాలల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విపులంగా వివరించారు. సందేహాలు అడిగిన విద్యార్థులకు సమాధానాలు ఇచ్చి, చట్టాలపై ఆసక్తి పెంపొందేలా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం అనంతరం న్యాయమూర్తి శిరీష విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నించి, సరైన సమాధానాలు చెప్పిన వారికి ప్రోత్సాహకంగా బహుమతులను (పెన్నులను) అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ సభ్యులు శ్రీశైలం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.