ఉపాధ్యాయ హామీలు అమలు చేయాలి: డా. కె. లక్ష్మణ్

  • పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఏవీఎన్ రెడ్డి

విశ్వంభర, హైదరాబాదు : ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీ పోస్టుల భర్తీ, పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాదులోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన మహాధర్నాలో వారు మాట్లాడారు. డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పీఆర్సీ ప్రకటించడం, పెండింగ్ బిల్లులు, కరవు భత్యాలు విడుదల చేయడం, బదిలీలు, పదోన్నతులు చేపట్టడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య మాట్లాడుతూ, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు, సీపీఎస్ రద్దు, 2008 డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ, పెండింగ్ బిల్లులు, ఆరు కరవు భత్యాలు, పాఠశాల గ్రాంట్లు, వార్షిక బదిలీలు, పదోన్నతుల క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్‌ఎస్‌ఎం సంఘటనా మంత్రి గుంత లక్ష్మణ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కానుగంటి హనుమంతరావు, డాక్టర్ సూరం విష్ణువర్ధన్ రెడ్డి, పర్వతం సంధ్యారాణి, రామకృష్ణారెడ్డి, బండి రమేష్, షేక్ కృష్ణారెడ్డి, వెంకటరమణరావు,భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, ఉదయ్ కిరణ్, అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dr-k-laxman-should-implement-teacher-guarantees/article-20746

Tags: