భయాందోళనలో సిగ్నల్ కాలనీవాసులు

భయాందోళనలో సిగ్నల్ కాలనీవాసులు

  • అయోమయంలో ప్రైవేట్ పట్టాదారులు
    పారదర్శకంగా సర్వే నిర్వహించి అందరికీ న్యాయం చేయాలి: సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 25, 26 వార్డుల పరిధిలో ఉన్న సిగ్నల్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన భూసర్వే ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నేపథ్యంలో కాలనీవాసులు, ప్రైవేట్ పట్టాదారులు భయాందోళనకు గురయ్యారు. తమ ఇళ్లు లేదా భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తకుండా అధికారులు పారదర్శకంగా సర్వే నిర్వహించి న్యాయం చేయాలని వారు కోరారు. సమాచారం అందుకున్న సీపీఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని కాలనీవాసులు, పట్టాదారులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లు దెబ్బతినకుండా, అదే సమయంలో ప్రైవేట్ పట్టాదారుల హక్కులు కూడా కాపాడేలా అధికారులు నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని కోరారు. కొంతమంది ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రభుత్వ భూమి ఉందంటూ జెండాలు పాతడం వల్ల సమస్య మరింత జటిలమైందని ఆయన ఆరోపించారు. దీనిపై కాలనీవాసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇటువంటి చర్యలు తమ ఇళ్లకు ముప్పు తెచ్చే పరిస్థితి సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి తన స్థల వివాదం పరిష్కారం కోసం సర్వే కోరిన నేపథ్యంలో మొత్తం ప్రాంతంలో సర్వే జరుగుతోందని, ఈ ప్రక్రియలో ఎవరి భూమి వారికే దక్కేలా, ఎవరికీ అన్యాయం జరగకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కాలనీవాసులు, పట్టాదారులు విజ్ఞప్తి చేశారు. సర్వే కార్యక్రమంలో ప్రభుత్వ సర్వే అధికారులు ఏడీఏ శ్రీనివాసులు, శంకర్, లింగం, రాము, మహేష్, సురేష్‌తో పాటు పట్టాదారులు అచ్చ పాపయ్య, నీలం వెంకటేశ్వర్లు, చేపూరి నరేష్, గుండా నాగేశ్వరరావు, జెన్నాయికోడే శ్రీనివాస్, జైల్, పెరుగు కుమార్, నర్రా శ్రావణ్, ఎండీ ఫాతిమా, మంద శంకర్, తండా శ్రీనాథ్, కాలనీవాసులు నాంచారి దాసు, ఉప్పలయ్య, కొమరయ్య, లాలు, గౌతమ్, రమణ, అప్పయ్య, రవీందర్, ఉమా, నిర్మల, పుష్ప, యాదమ్మ, సరిత, స్వరూప, రాము తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/signal-colonists-in-panic/article-20668

Tags: