13 వ వార్డులో ఎస్‌ఐఆర్ వార్డు సభ 

13 వ వార్డులో ఎస్‌ఐఆర్ వార్డు సభ 

  • ఏఎస్‌డీ ఓటర్ల జాబితా సవరణకు ఆమోదం

విశ్వంభర, పరిగి: పురపాలక సంఘం పరిధిలో  ఎస్‌ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాలు సంబంధించిన ఏఎస్‌డీ ఆబ్సేంట్, షిఫ్టేడ్, డెత్ డబుల్ ఓటర్ల జాబితాలపై సమీక్ష చేపట్టారు. ఈ వార్డు సభలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, సూపర్వైజర్లు, బీఎల్‌వోలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు 13వ వార్డులో ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ ఖాన్ కాలనీలోని సిద్ధార్థ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు 214, 215 పరిధికి చెందిన ఓటర్ల నుంచి స్వీకరించిన గణన పత్రాలను, వాటి డిజిటలైజేషన్ అలాగే ధృవీకరణ వివరాలను వెల్లడించారు. అదేవిధంగా సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలో మరణించిన ఓటర్లు, శాశ్వతంగా చిరునామా మార్చుకున్న ఓటర్లు, రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్న డబుల్ ఓటర్లు, అందుబాటులో లేని ఓటర్ల వివరాలను బీఎల్‌వోలు సభలో చదివి వినిపించారు. స్థానికుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జాబితాలోని పేర్లను పరిశీలించారు. సభలో చర్చించిన వివరాలకు హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ కె. మల్లేష్, వార్డు కౌన్సిలర్ సమీనా మీర్ తాహేర్ అలీ, బీజేపీ పరిగి ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ బూనేటి, బీజేపీ నాయకురాలు అనూష, ముకుంద నాగేశ్వర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేంద్ర రెడ్డి, ఖైసర్ బేగ్, ఖదీర్, అక్బర్, తోపాటు సంతోష్, సమీర్, కుర్వ నరేందర్, రఫీ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sir-ward-assembly-in-13th-ward/article-20692

Tags: