జానకికి స్వర నీరాజనం
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: భారతీయ సినీ సంగీత దిగ్గజం స్వర్గీయ ఎస్. జానకికి నివాళిగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, ప్రజ్ఞా మెలోడీస్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ‘స్వర నీరాజనం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గంట శివ కల్యాణి మాట్లాడుతూ, భారతీయ సినీ సంగీత రంగంలో ఎస్. జానకి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆమె గాన వైభవం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జానకి గారి స్మృతిని సజీవంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పలువురు గాయకులు ఆమె ఆలపించిన మధుర గీతాలను ఆలపించి సంగీత నివాళి అర్పించగా, అనంతరం కళాకారులను ప్రశంసాపత్రాలు, చేనేత కండువాలతో సత్కరించారు.