వీరారెడ్డి నగర్‌ను సందర్శించిన ఎం ఎం సి  కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి  

విశ్వంభర, బోడుప్పల్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్  వినయ్ కృష్ణా రెడ్డి బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని వీరారెడ్డి నగర్‌ను  క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్  ఎ. శైలజ బోడుప్పల్లో ప్రధానంగా ఉన్న సమస్యలను కమిషనర్ కు వివరించారు. కాలనీలోని రహదారులు, పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీల పరిస్థితి మరియు పారిశుధ్య కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు. రహదారుల మరమ్మతు పనులు, పారిశుధ్య నిర్వహణ, చెత్త సకాలంలో తొలగింపు, డ్రైనేజీల శుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, మున్సిపల్ సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mmc-commissioner-vinay-krishna-reddy-visited-veera-reddy-nagar/article-20767

Tags: