రాజకీయాల్లో బూతు సంస్కృతికి బీజేపీయే బీజం వేసింది: డాక్టర్ దిడ్డి సుధాకర్
విశ్వంభర, బషీర్‌బాగ్: రాజకీయాల్లో బూతు సంస్కృతికి బీజేపీయే బీజం వేసిందని, అసభ్య భాషకు ముగింపు పలకాలంటే ముందు అధికార పార్టీనే ఆదర్శంగా నిలవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సలహాదారు, ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, అసభ్య పదజాలాన్ని తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. అయితే, ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఉపయోగించుకోవడం తగదన్నారు. గత 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో ద్వేషపూరిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు బీజేపీ ప్రోత్సాహం ఇచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా, అర్బన్ నక్సల్స్‌గా, విదేశీ శక్తుల ఏజెంట్లుగా ముద్ర వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన చర్చలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.