ఆగస్టు 7న బెంగళూరులో ఓబీసీ జాతీయ మహా సభ
విశ్వంభర, బషీర్ బాగ్: ప్రధాని నరేంద్ర మోడీ బీసీ వ్యతిరేక చర్యలను విడనడక పోతే , దేశవ్యాప్త ఓబీసీ వ్యతిరేక ఉద్యమం మొదలవుతుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు 60 శాతానికి పెంచుతూ, మహిళ బిల్లులో ఓబీసీ సబ్ కోటా విధించాలని జాజుల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ లతో ఆగస్టు 7న బెంగళూరులో ఓబీసీ 11వ జాతీయ మహా సభ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం బషీర్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేష్ చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహాసభకు సంబంధించిన పోస్టర్ ను జాజుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రధాన డిమాండ్ తో భవిష్యత్ కార్యాచరణ ఉద్యమాన్ని ఈ మహా సభలో ప్రకటిస్తామని తెలిపారు. మహిళ బిల్లులో ఓబీసీలకు సబ్ కోటా లేకపోతే ఓబీసీ మహిళలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల అగ్ర వర్ణాలకే అధిక ప్రయోజనం చేకూరుతుందని , ఓబీసీలకు ఒరిగేది ఏమి లేదులేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ జనగణన లో ఓబీసీ కులాలను కూడా ఎస్సి , ఎస్టీల మాదిరిగా గుర్తించి లెక్కించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ బిసి వ్యతిరేక చర్యలు మనుకోకపోగే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు 7న బెంగళూరులో జరగనున్న జాతీయ ఓబీసీ మహా సభకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలంగాణ , ఏపీ , మహారాష్ట్రలకు చెందిన బిసి మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీలతో పాటు 29 రాష్ట్రాల నుండి ఓబీసీ ప్రతినిధులు హాజరవుతారని జాజుల వివరించారు. బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, విక్రమ్ గౌడ్, శ్యాం కుర్మా, కౌలే జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.పూర్తి వివరాలకు 9440630681 జిల్లా యువజన క్రీడా శాఖ అధికారిని సంప్రదించగలరని అన్నారు.