పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి

పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి

  • రైతు సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

విశ్వంభర, నెల్లికుదురు: పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఐ(ఎంఎల్)రైతు సంఘం ఆధ్వర్యంలో నెల్లికుదురు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. అనంతరం ఈ మేరకు తాసిల్దార్ చంద నరేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్నలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు లబ్ది చేకూర్చడం కోసం 50 కిలోల బస్తాకురూ.50 రూపాయల నుండిరూ.300 వరకు పెంచిందని,రైతు పండించిన 13 రకాల పంటలకు రూ.10 నుండి 50 రూపాయల వరకు పెంచి దేశంలో రైతులను ధనికులుగా మారుస్తున్నామని చెప్పటం సిగ్గుచేట న్నారు.ఎరువుల కంపెనీల లాభాల కోసం దేశంలో చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వంతీరు పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి జక్కుల యాకయ్య, పి వై ఎల్ జిల్లా మాజీ కార్యదర్శి ఇరుగు అనిల్,తో పాటు తోట రవీందర్,సంపత్, కనుకు,మధు, మహేష్ వెంకటమ్మ, లక్మి, తరమ్మ, సుగుణ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాగా తహసిల్దార్ నరేష్ స్పందించి సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/increased-fertilizer-prices-should-be-reduced-immediately/article-18124

Tags: