కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క
- ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాకాల-కొత్తగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా. బి. లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, 2026–27 విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి బి.ఏ. (ఇంగ్లీష్ మీడియం), బి.కాం (కంప్యూటర్ సైన్స్ – ఇంగ్లీష్ మీడియం), బి.ఎస్‌సీ (లైఫ్ సైన్సెస్ – ఇంగ్లీష్ మీడియం), బి.ఎస్‌సీ (ఫిజికల్ సైన్సెస్ – ఇంగ్లీష్ మీడియం) కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి కోర్సులో కేవలం 60 సీట్లు మాత్రమే ఉండటంతో విద్యార్థులు త్వరగా అడ్మిషన్ పొందాలని సూచించారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 99081 27796 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీవో అలివేలు, డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. బి. లక్ష్మణ్ నాయక్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.