ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
- ఆపరేషన్ ముస్కాన్-12ను విజయవంతం చేయాలి: కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును బాధ్యతగా స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్‌తో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చట్ట నిబంధనల మేరకు అర్హులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రజావాణిలో ప్రధానంగా భూ వివాదాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ, మున్సిపల్, పంచాయతీ సమస్యలకు సంబంధించిన మొత్తం 225 దరఖాస్తులు అందాయి. వాటిని శాఖల వారీగా ఆన్‌లైన్ ద్వారా సంబంధిత అధికారులకు పంపించి, నిర్దేశిత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆపరేషన్ ముస్కాన్-12 కార్యక్రమాన్ని ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. తప్పిపోయిన, పారిపోయిన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చడం, బాలకార్మికులను రక్షించడం కోసం అన్ని శాఖలు, పోలీసు విభాగం సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఇటుక బట్టీలు, బేకరీలు, మెకానిక్ షాపులు, నిర్మాణ పనులు తదితర ప్రాంతాల్లో బాలకార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్, డీఆర్వో నాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.