రామన్నపేటలో ఘనంగా డా.బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి
విశ్వంభర, రామన్నపేట: భారత మాజీ ఉప ప్రధాని, దళితుల నేత డా.బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో రహదారి బంగ్లా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ జమీరుద్దీన్ మాట్లాడుతూ, డా.బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి, సమాజంలోని అణగారిన వర్గాలకు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, బండ అంజిరెడ్డి, బొడ్డు శంకరయ్య, మహమ్మద్ అక్రమ్, మహమ్మద్ రిజ్వాన్, కేశవదాసు, ఉదయ్, మహమ్మద్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.