శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
- ఒకరు మృతి మరొకరికి గాయాలు
విశ్వంభర, కందుకూర్ : కందుకూరు మండలం దెబ్బడగూడ గేట్ సమీపంలో శ్రీశైలం హైవేపై మయూరి ఫీడ్ కంపెనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైసిగండి మైసమ్మ అమ్మవారి దర్శనం ముగించుకుని, హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు హోండా యూనికాన్ మోటార్ సైకిల్‌పై హైదరాబాద్ కు వెళ్తున్న సమయంలో, కడ్తాల్ వైపు నుంచి వస్తున్న భారత్ బెంజ్ పాల ట్యాంకర్ ( టీఎస్ 05 యుసి 7771) అతివేగంగా, ద్విచక్ర మోటార్ బైకును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యలగండుల సాయి కృష్ణ (32) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయనతో ప్రయాణిస్తున్న పతిపాక సాయి కిరణ్,(31)కు చేతులు, కాళ్లపై గాయాలయ్యాయి. సంఘటన విషయము తెలుసుకున్న కందుకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటన పరిశీలించిగా ఒకరు మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. సంఘటన స్థలన మృతి చెందిన యాల గండుల సాయి కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరొకరిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. మృతుడి భార్య యలగండుల మైత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందుకూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన పాల ట్యాంకర్ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్న కందుకూరు పోలీసులు.