రైతులకు అండగా బిఆర్ఎస్ : ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి 

 విశ్వంభర, కందుకూరు :  కందుకూరు మండలం సార్లరావుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పోతుబండ తండాలో, ఫోర్త్ సిటీ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం  అందించాలని  రైతులకు భరోసాగా బి ఆర్ఎస్  పార్టీ అండగా ఉంటుంది అని,మాజీ మంత్రి, మహేశ్వరం  ఎమ్మెల్యే  సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ, రైతులు నష్టపోకుండా రీ సర్వే చేసి రైతులను న్యాయం  చేయాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ  రైతుల పక్షాన నిలబడుతుందని అన్నారు. అభివృద్ధి పేరుతో రైతు భూమిని తీసుకుంటే, న్యాయమైన నష్టపరిహారం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తదుపరి కార్యక్రమంలో మంగళ్లి గడ్డ తండా రైతులు ధర్నా నిర్వహిస్తామని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచులు. ప్రవీణ్ నాయక్,గోవర్ధన్ నాయక్,పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహ రెడ్డి, మన్నే జయేందర్ ముదిరాజ్, సురసాని సురేందర్ రెడ్డి, దేవరశెట్టి చంద్రశేఖర్, మేఘనాథ్ రెడ్డి, తాండ్ర ఇందిరా దేవేందర్, కాకి ఇందిరాదశరథ ముదిరాజ్,దామోదర్ గౌడ్, ప్రకాష్ రెడ్డి, పొట్టి ఆనంద్, దేవీలాల్, బ్రాహ్మణపల్లి జ్యోతి చంద్రశేఖర్, గుండాల సురేష్, పొన్నం అంజయ్య, బేగర్ కంచ సర్పంచ్ వెంకటేష్ నాయక్, ఉప సర్పంచ్ శివ ముదిరాజ్, కురుమిద్ద గ్రామం సర్పంచ్ నీలం శ్రీవిద్య - శ్రీ రాములు ముదిరాజ్, తేరేటి రాజు ముదిరాజ్, కాకి రవీందర్ ముదిరాజ్,  అరుణ్, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/brs-mla-sabitha-indra-reddy-stands-by-the-farmers/article-18160

Tags: