ఏజెన్సీలో గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
- సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపట్టాలి: ఏడీఎంహెచ్‌వో సైదులు
విశ్వంభర, భద్రాచలం: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏడీఎంహెచ్‌వో సైదులు వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు మారుమూల గ్రామాల్లో గర్భిణీలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రసవాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, విరేచనాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. గుత్తికోయ గ్రామాలు, గూడేలు, తండాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేయాలని, పారిశుద్ధ్యం, దోమల నివారణ, పరిశుభ్రమైన తాగునీటిపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర మందులు, మలేరియా నిర్ధారణ కిట్లు, గర్భిణీలకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బందితో సమన్వయం పెంచి ప్రతి ఇంటికీ వైద్య సేవలు చేరేలా చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధులపై గ్రామాల వారీగా ప్రతిరోజూ పర్యవేక్షణ నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో ఏజెన్సీ పరిధిలోని వివిధ మండలాల వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.