ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
విశ్వంభర, రామన్నపేట: ప్రముఖ జాతీయవాది, జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన భారత జాతీయ కాంగ్రెసు విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించాడని, ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధాన మంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించాడని, ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని నిరసిస్తూ పోరాటం చేసిన మహనీయుడని అన్నారు. వ్యాసరచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్-ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.రత్న మంజుల, అధ్యాపకులు డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, డాక్టర్ జె.చిన్నబాబు, డాక్టర్ ఎన్.లక్ష్మీ నీలిమ, డాక్టర్ జి.సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎం.అనిత, డాక్టర్ డి.కిషన్, డాక్టర్ ఎం.రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీనుతో పాటు నిర్వాహకులు బాబు, బాబూరావు, విద్యార్థులు పాల్గొన్నారు.