అగ్రికల్చర్ బోధకులతో పాటు ఇంగ్లీష్, పీఈటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
విశ్వంభర, గుండాల: కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల (కేజీబీవీ), గుండాలలో అగ్రికల్చర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ విభాగంలో అగ్రికల్చర్ బోధించేందుకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4.00 గంటలలోపు కేజీబీవీ జూనియర్ కళాశాల, గుండాలలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నియామకానికి మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. అగ్రికల్చర్ బోధక పోస్టుకు ఎంఎస్సీ (అగ్రికల్చర్) విద్యార్హత తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.23,000 వేతనం అందజేయబడుతుంది. అదేవిధంగా, ఇంగ్లీష్ మరియు పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) పోస్టులకు కూడా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలియజేశారు.