బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్‌కు గవర్నర్‌కు ఆహ్వానం
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులో జులై 14 నుంచి 16 వరకు నిర్వహించనున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించింది. ఈ సందర్భంగా సమ్మిట్ నిర్వహణ, లక్ష్యాలు, అంతర్జాతీయ కార్మిక సంఘాల భాగస్వామ్యంపై ప్రతినిధి బృందం గవర్నర్‌కు వివరించింది. కార్మిక సంక్షేమం, శ్రామికుల హక్కులు, ప్రపంచ కార్మిక రంగంలో నెలకొన్న సవాళ్లపై చర్చలకు ఈ సమ్మిట్ వేదికగా నిలవనుందని పేర్కొంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గవర్నర్ ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ చైర్మన్, భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారత అధ్యక్షుడు మల్లేశం, సమ్మిట్ ఆర్గనైజింగ్ చీఫ్ కోఆర్డినేటర్, భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారత ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేంద్రన్, తెలంగాణ భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి టి. రామ్ రెడ్డి, తెలంగాణ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జె. రామ్ మోహన్ పాల్గొన్నారు.