రక్తదాన అవార్డు గ్రహీత చేపూరి శంకర్ కు సత్కారం.
అభినందించిన ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న
విశ్వంభర, హైదరాబాద్ :- ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గోరేటి వెంకన్న క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ సామాజికవేత్త మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్ ను ఆకృతి సంస్థ నిర్వాహకులు సంతరించారు. ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా రక్తదాన అవార్డు అందుకున్న సందర్బంగా ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకన్న మాట్లాడుతూ 30 పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి దాదాపు 1000 కి పైగా సభ్యులతో రక్తదానం చేయించడం చాలా గొప్ప విషయం అన్నారు. తాను కూడా ప్రతి శిబిరంలో 25 సార్లు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి రక్త దాతలుగా మారాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సిటీ కాలేజ్ ప్రొఫెసర్ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయీ కోటేశ్వరరావు మాట్లాడుతూ సమాజాన్ని రక్తదానానికి ప్రోత్సహించడంలో చేపూరి శంకర్ అంకితభావం పట్టుదల కార్యదీక్ష అమూల్యమైనదని ప్రశంసించారు. సభకు ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు. తనకు జరిగిన ప్రత్యేక సత్కారానికి చేపూరి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.